|
|
by Suryaa Desk | Sat, Apr 19, 2025, 10:57 AM
పేదల ఇంట్లో భోజనం చేయడం చాలా సంతోషంగా ఉందని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శుక్రవారం మహబూబ్ నగర్ జిల్లా హన్వాడ మండల కేంద్రానికి చెందిన సన్న బియ్యం లబ్దిదారులు అంజిలమ్మ రాములు దంపతుల ఇంట్లో కలిసి ఎమ్మెల్యే భోజనం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజలు సగర్వంగా బతికేలా సన్న బియ్యం పథకాన్ని తీసుకువచ్చినట్లు తెలిపారు.