|
|
by Suryaa Desk | Sat, Apr 19, 2025, 11:46 AM
ఏసుక్రీస్తు బోధనలు విశ్వ మానవ సమానత్వానికి దోహదం చేశాయని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. గుడ్ ఫ్రైడే పురస్కరించుకొని శనివారం పటాన్ చెరులో మైత్రి మైదానంలో ఏర్పాటు చేసిన రన్ ఫర్ జీసస్ ద్విచక్ర వాహనాల ర్యాలీని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, పృథ్వీరాజ్, నరేష్, వివిధ క్రిస్టియన్ సంఘాల ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.