|
|
by Suryaa Desk | Sat, Apr 19, 2025, 02:17 PM
కంచ గచ్చిబౌలి భూముల విషయంలో ‘హాయ్ హైదరాబాద్’ అని ట్వీట్ చేసినందుకు ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్‌కు గచ్చిబౌలి పోలీసులు నోటీసులు అందజేసిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై ఆమె స్పందించారు. హాయ్ హైదరాబాద్ ట్వీట్‌ను తాను రీపోస్ట్ చేశానని, నాలాగే 2 వేల మంది ఆ ట్వీట్‌ను పోస్ట్ చేశారని వారందరికి నోటీసులు ఇస్తారా ? అని ప్రశ్నించారు. అయినా చట్టాన్ని గౌరవించే వ్యక్తిగా పోలీసులు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పినట్లు తెలిపారు.