|
|
by Suryaa Desk | Sat, Apr 19, 2025, 03:54 PM
భూ భారతి చట్టం చారిత్రాత్మక చట్టమని నాగార్జునసాగర్ శాసనసభ్యులు కుందూరు జైవీర్ రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన తెలంగాణ భూ భారతి చట్టం ( భూమి హక్కుల చట్టం- 2025) పై అవగాహన సదస్సులలో భాగంగా శనివారం నాగార్జునసాగర్ నియోజకవర్గం అనుముల ( హలియా) మండల కేంద్రం సమీపంలోని కొత్తపల్లి రైతు వేదికలో భూ భారతి పై నిర్వహించిన అవగాహన సదస్సుకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.