|
|
by Suryaa Desk | Sat, Apr 19, 2025, 03:56 PM
అమరచింత మండలం ఈర్లదిన్నె గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన అంబేడ్కర్ విగ్రహాన్ని శనివారం ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి ఆవిష్కరించారు. ముందు చూపుతో దేశానికి అతిపెద్ద రాజ్యాంగాన్ని అందించిన గొప్ప వ్యక్తి అంబేడ్కర్ అని అన్నారు. ఆయన ఆశయాల సాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో రాష్ట్ర కల్లు గీత సంఘం చైర్మన్ నాగరాజ్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, అంబేడ్కర్ సంఘం నాయకులు పాల్గొన్నారు.