|
|
by Suryaa Desk | Sat, Apr 19, 2025, 08:04 PM
మాడుగులపల్లి మండల పరిధిలోని చిరుమర్తి, ఆగా మోత్కూరు, గుర్రప్పగూడెం గ్రామాలలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను మండల డీఆర్డీఏ ఏపీఎం భాషపాక చంద్రశేఖర్ సందర్శించారు. ధాన్యం కొనుగోలుకు సంబంధించి వివరాలను నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. ధాన్యం కొనుగోలులో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. వారి వెంట సీసీ సైదులు, రేణుక, ఉదయభాను, సోనియా తదితరులున్నారు.