|
|
by Suryaa Desk | Sun, Apr 20, 2025, 03:06 PM
కాలనీలో నెలకొన్న అన్ని సమస్యలను పరిష్కరిస్తానని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి హామీ ఇచ్చారు. ఆదివారం పట్టణంలోని జగ్జీవన్ రామ్ నగర్ కాలనీలో ఎమ్మెల్యే ఆకస్మికంగా పర్యటించారు.
నిరుపయోగంగా ఉన్న ప్రభుత్వ భూమిని పరిశీలించారు. పట్టణం నడిబొడ్డున ఉన్న ఈ స్థలాన్ని ఎందుకు ఉపయోగించుకోవడం లేదని అధికారులను ప్రశ్నించారు. చదును చేసి క్రీడా మైదానానికి కేటాయించాలని మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ను ఆదేశించారు.