|
|
by Suryaa Desk | Sun, Apr 20, 2025, 03:12 PM
తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి మహారాష్ట్రలోని ప్రముఖ పుణ్యక్షేత్రం షిరిడీ పర్యటనలో ఉన్నారు. సీఎస్ శాంతికుమారి తిరిగి రేపు (సోమవారం) హైదరాబాద్ చేరుకోనున్నారు.
ఏప్రిల్ 30వ తేదీన సీఎస్ శాంతికుమారి పదవీ విరమణ చేయనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆమె షిరి సాయినాథుని దర్శించుకుని స్వామి వారి ఆశీస్సులు పొందారు. మరోపక్క తెలంగాణ కొత్త సీఎస్ ఎంపికపై జోరుగా చర్చలు జరుగుతున్నాయి.