|
|
by Suryaa Desk | Sun, Apr 20, 2025, 03:16 PM
నారాయణపేట మండలంలో ఆదివారం ఈస్టర్ పర్వదినాన్ని క్రైస్తవులు భక్తిశ్రద్దలతో ఘనంగా నిర్వహించారు. నారాయణపేట పట్టణంలోని మూడు చర్చీలో పాటు మండలంలోని బైరంకొండ, కొల్లంపల్లి, సింగారం గ్రామాల్లోని చర్చీల్లో ఈస్టర్ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు.
సింగారం గ్రామంలో ఉదయం ప్రభువును స్మరిస్తూ పాటలు పాడుతూ ర్యాలీగా కల్వరి కొండకు చేరుకొని అక్కడ ఉదయకాల ఆరాధన కార్యక్రమం నిర్వహించి, ప్రత్యేక ప్రార్థనలు చేశారు.