|
|
by Suryaa Desk | Sun, Apr 20, 2025, 07:13 PM
సూర్యాపేట జిల్లా చింతలపాలెం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. కోదాడ నుంచి చింతలపాలెం వెళ్తున్న ఆర్టీసీ బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. బైకర్ అడ్డురావడంతో డ్రైవర్ అతడిని.
తప్పించే క్రమంలో బస్సును టర్న్ చేయగా స్టీరింగ్ రాడ్డు విరిగి బోల్తా పడింది. ప్రమాదంలో పలువురు ప్రయాణికులకు గాయాలు కాగా స్థానికులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.