|
|
by Suryaa Desk | Sun, Apr 20, 2025, 07:17 PM
ఇల్లంతకుంట మండలం సోమవారం పేటలో శ్రీ రేణుక ఎల్లమ్మ ఆలయ నిర్మాణం కోసం గౌడ సంఘం సభ్యులు ఆదివారం భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా గౌడ సంఘం సభ్యుల ఆహ్వానం.
మేరకు ఇల్లంతకుంట మాజీ ఎంపీపీ వెంకట రమణారెడ్డి హాజరై కార్యక్రమంలో పాల్గొన్నారు. శ్రీ రేణుకా మాత ఆలయం త్వరితగతిన పూర్తయ్యే విధంగా కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు. మార్కెట్ కమిటీ డైరెక్టర్ సురేందర్ రెడ్డి, గౌడ సంఘం సభ్యులు పాల్గొన్నారు.