|
|
by Suryaa Desk | Sun, Apr 20, 2025, 07:27 PM
అక్కన్నపేట మండలం మల్ చెరువు తండాలో గుగులోత్ శంకర్ నాయక్, గుగులోత్ జుక్ర నాయక్ రైతులకు సంబంధించిన మామిడి తోటలు ఈదురు గాలులు, అకాల వర్షానికి 80 మామిడి చెట్లు నేల వాలాయి.
దీంతో మామిడికాయలు కూడా రాలి తీవ్ర నష్టం జరిగింది. ఈ విషయంలో బీఎస్పీ పార్టీ నాయకులు వారి తోటలను పరిశీలించి దాదాపు మూడు లక్షల వరకు నష్టం జరిగిందని వెంటనే మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదుకోవాలని వారు కోరారు.