|
|
by Suryaa Desk | Sun, Apr 20, 2025, 07:34 PM
పోచమ్మ ఆలయ అభివృద్ధి కోసం నిధులు కేటాయిస్తామని సిర్పూర్ ఎమ్మెల్యే డా. పాల్వాయి హరీశ్ బాబు అన్నారు. కాగజ్‌నగర్ మండలం బాపునగర్లో నూతనంగా నిర్మించిన దేవాలయంలో పోచమ్మ అమ్మవారి ప్రతిష్ఠాపన.
కార్యక్రమంలో ఎమ్మెల్యే దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యే ను శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే రాజ్యలక్ష్మి ఉన్నారు.