|
|
by Suryaa Desk | Mon, Apr 21, 2025, 06:08 PM
కంచె గచ్చిబౌలి భూముల వ్యవహారంలో పోలీసులు విచారణ పేరుతో వేధింపులకు గురి చేస్తున్నారని.. BRS సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిశాంక్ మానవహక్కుల కమిషన్‌ను ఆశ్రయించారు. ఇప్పటికే ఈ కేసు విషయంలో మూడు సార్లు విచారణకు పిలిచారని, మళ్లీ ఈ నెల 23న హాజరు కావాలని నోటీసులు ఇచ్చారని పేర్కొన్నారు. దర్యాప్తు పేరుతో ఏమి విచారించకుండా పోలీస్ స్టేషన్లో ఖాళీగా కూర్చోపెట్టి సమయం వృథా చేస్తున్నారని తెలిపారు.