|
|
by Suryaa Desk | Mon, Apr 21, 2025, 06:19 PM
ఈనెల 23వ తేదీన హైదరాబాద్ స్థానిక సంస్థల నియోజకవర్గ MLC ఎన్నికకు పోలింగ్ జరుగనున్న విషయం తెలిసిందే. నగరం ప్రశాంతంగా ఉండాలంటే BJP MLC అభ్యర్థిని గెలిపించాలని ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. హైదరాబాద్‌లో ఫ్లైఓవర్లకు కేంద్ర నిధులు అందుతున్నాయని, కేంద్ర నిధులతోనే ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం జరుగుతుందని వెల్లడించారు. ఎమ్ఐఎమ్ పార్టీకి ఓటు వేస్తే, మన వేలితో మన కంట్లో పొడుచుకున్నట్లు అవుతుందని MP అన్నారు.