|
|
by Suryaa Desk | Mon, Apr 21, 2025, 06:59 PM
వరి కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని అచ్చంపేట మార్కెట్ కమిటీ చైర్మన్ రజిత అన్నారు. సోమవారం లింగాల మండల కేంద్రంలోని సింగిల్ విండో ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. దళారులను నమ్మి మోసపోవద్దని కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయించాలని సూచించారు. సన్న రక్తం ధాన్యానికి ప్రభుత్వం రూ. 500 బోనస్ ఇస్తుందని తెలిపారు.