|
|
by Suryaa Desk | Wed, Apr 23, 2025, 12:04 PM
జాతీయ స్థాయి క్రీడల్లో రాణించే పోలీస్ క్రీడాకారులకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని వరంగల్ పోలీస్ కమిషనర్ తెలియజేశారు. గత నెల మార్చిలో మధ్యప్రదేశ్ ఇండోర్లో జరిగిన 18వ జాతీయ పోలీస్ షూటింగ్ (స్పోర్ట్స్) ఛాంపియన్ షిప్ లో తెలంగాణ పోలీస్ తరపున ప్రాతినిధ్యం వహించి మూడు వందల మీటర్ల మహిళా జట్టు విభాగంలో సిల్వర్ మెడల్ సాధించిన సుబేదారి ఏఎస్ఐ సువర్ణను వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్, IPS గారు సోమవారం కమిషనరేట్ కార్యాలయంలో ఘనంగా సత్కరించారు. భవిష్యత్తు కాలంలో ఈ క్రీడలో రాణించేందుకు అవసరమైన సహకారాన్ని అందిస్తామని పోలీస్ కమిషనర్ సువర్ణకు భరోసా నిచ్చారు. ఈ కార్యక్రమంలో పరిపాలన విభాగం అదరపు డిసిపి రవి పాల్గొన్నారు.