|
|
by Suryaa Desk | Wed, Apr 23, 2025, 03:14 PM
TG: రాష్ట్రంలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. SRD, VKB, HYD, RR, యాదాద్రి భువనగిరి మినహా మిగతా జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ అయ్యాయి. రాత్రిపూట వాతావరణ పరిస్థితులు వేడిగా మారే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ఇక ఎల్లుండి పలు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని అంచనా వేసింది.