|
|
by Suryaa Desk | Wed, Apr 23, 2025, 03:36 PM
అఘోరీ కేసు మరో మలుపు తిరిగింది. చీటింగ్ కేసులో అఘోరీని ఇప్పటికే పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. కాసేపటి క్రితమే చేవెళ్ల కోర్టులో న్యాయమూర్తి ఎదుట పోలీసులు ఆమెను హాజరు పరచగా, 14 రోజుల పాటు రిమాండ్ విధిస్తూ తీర్పునిచ్చారు. దీంతో అఘోరిని నేరుగా సంగారెడ్డి జిల్లా కంది సెంట్రల్ జైలుకు తరలించారు. ప్రస్తుతం కంది జైల్లోనే ఉన్న అఘోరీకి రిమాండ్ సంబంధించిన పనులు పూర్తి చేసి జైల్లో ఉంచారు.