|
|
by Suryaa Desk | Wed, Apr 23, 2025, 06:02 PM
ఎస్ఆర్ఆర్ డిగ్రీ కళాశాల ఎన్ఎస్ఎస్ వాలంటీర్ల జాతీయ సేవా పథకం ప్రత్యేక శిబిరం మంగళవారం కార్యక్రమాలు కొనసాగాయి. నగునూరు, తీగలగుట్టపల్లి, వల్లంపహాడ్లలో పచ్చదనం పరిశుభ్రత కార్యక్రమం నిర్వహించారు.
మూడు యూనిట్ల వాలంటీర్లు ఇందులో పాల్గొన్నారు. పరిసరాల పరిశుభ్రతను ప్రజలందరూ తప్పనిసరిగా పాటించాలని పేర్కొన్నారు. ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్లు డా. పడాల తిరుపతి, డాక్టర్ అర్జున్ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు.