|
|
by Suryaa Desk | Wed, Apr 23, 2025, 08:17 PM
పహల్గామ్ ఉగ్రదాడిలో 28 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో SRH, MI ప్లేయర్లు, అంపైర్లు గ్రౌండ్లో నిమిషం పాటు ప్రేక్షకులతో కలిసి మౌనం పాటించారు. అలాగే వారు నల్ల బ్యాడ్జీలు ధరించి ఆడనున్నారు. టాస్ సమయంలో, రెండు జట్ల కెప్టెన్లు బాధితులకు నివాళులు అర్పించి ఉగ్రవాద దాడిని ఖండించారు. అలాగే ప్లేయర్లు, మ్యాచ్ అధికారులు, వ్యాఖ్యాతలు గౌరవ సూచకంగా నల్ల ఆర్మ్ బ్యాండ్లు ధరించారు. ఇక గౌరవార్థం, మ్యాచ్ సమయంలో చీర్ లీడర్ల ప్రదర్శనలను కూడా నిషేధించారు.