|
|
by Suryaa Desk | Wed, Apr 23, 2025, 08:18 PM
తెలంగాణ విశ్వవిద్యాలయం దక్షిణ ప్రాంగణంలో పార్ట్ టైం అధ్యాపకులు చేపట్టిన నిరవధిక సమ్మె బుధవారానికి రెండో రోజుకు చేరింది. నిరవధిక సమ్మెలో భాగంగా పార్ట్ టైం అధ్యాపకుల ఆధ్వర్యంలో కాశ్మీర్ పహాల్గావ్లో జరిగిన ఉగ్ర దాడిని నిరసిస్తూ విద్యార్థులతో క్యాంపస్ ఆవరణలో ర్యాలీని నిర్వహించారు. విశ్వవిద్యాలయాలలో వెంటనే మినిమం టైమ్స్ స్కేల్ అమలు చేయాలని కోరారు. ప్రభుత్వం తమ న్యాయమైన పోరాటాన్ని గుర్తించాలన్నారు.