|
|
by Suryaa Desk | Wed, Apr 23, 2025, 08:30 PM
వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామివారి హుండీ లెక్కింపు బుధవారం ఆలయ ఓపెన్ స్లాబ్ యందు నిర్వహించారు. 29 రోజుల హుండీ ఆదాయం రూ. 2 కోట్ల, 1లక్ష, 53వేల, 852లు, కానుకల రూపంలో బంగారం 184 గ్రాములు, వెండి 12 కిలోల 300 గ్రాములు వచ్చినట్లు తెలిపారు. హుండీ లెక్కింపు ఆలయ ఈ. ఓ కె. వినోద్ రెడ్డి పర్యవేక్షణలో సహాయ కమిషనర్ కార్యాలయ జగిత్యాల డివిజన్ ఇన్స్పెక్టర్, ఎస్పీఎఫ్ సిబ్బంది పరిశీలనలో నిర్వహించారు.