|
|
by Suryaa Desk | Thu, Apr 24, 2025, 11:28 AM
బెల్లంపల్లి పట్టణంలోని కాల్ టెక్స్ జాతీయ రహదారి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మంచిర్యాలకు చెందిన తాడూరి నరేష్ చారి (36) మృతి చెందినట్లు టూ టౌన్ ఎస్సై మహేందర్ బుధవారం తెలిపారు. జాతీయ రహదారిపై నడుచుకుంటూ వెళ్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. దీంతో అక్కడికక్కడే మృతి చెందాడు. తల్లి విజయలక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.