|
|
by Suryaa Desk | Thu, Apr 24, 2025, 11:59 AM
దుబ్బాక మండలం పెద్దగుండవెల్లి గ్రామానికి చెందిన చిన్ని నర్సింహారెడ్డి(56) వ్యాపార నిమిత్తం సిద్దిపేటలో స్థిరపడ్డాడు. కొద్దికాలంగా సిద్దిపేటలో టింబర్ డిపో వ్యాపారం నిర్వహిస్తూ అప్పులపాలయ్యాడు. అప్పులవాళ్ళు వేధించడంతో మనస్తాపానికి గురై పురుగుమందు తాగాడు. కుమారుడు గమనించి వెంటనే ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. సందీప్ రెడ్డి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.