|
|
by Suryaa Desk | Thu, Apr 24, 2025, 02:14 PM
జమ్మూకశ్మీర్‌లో జరిగిన ఉగ్రదాడిని AIMIM నాయకుడు, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తీవ్రంగా ఖండించారు. అమాయకులను హత్య చేయడం దుర్మార్గమని ఆయన పేర్కొన్నారు. ఈ ఉగ్ర దాడిపై తగిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. జమ్మూకశ్మీర్ పర్యాటకులను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. ఒవైసీ మాట్లాడుతూ, "పహల్గామ్‌లో ఉగ్రవాదులు మతం అడిగి అమాయక ప్రజలను విచక్షణారహితంగా చంపారు. ఈ దాడిని మా పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది. అమాయకులను లక్ష్యంగా చేసుకున్న ఉగ్రవాదులపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలి. నిఘా వైఫల్యం ఈ దాడికి కారణమని స్పష్టంగా కనిపిస్తోంది. ఈ ఉగ్రవాదులందరికీ ప్రభుత్వం గుణపాఠం నేర్పాలి, బాధిత కుటుంబాలకు వీలైనంత త్వరగా న్యాయం జరగాలి" అని ఆశాభావం వ్యక్తం చేశారు. ఒక విదేశీ (నేపాలీ) పర్యాటకుడు కూడా ఈ దాడిలో మరణించడం అత్యంత బాధాకరమని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.