|
|
by Suryaa Desk | Thu, Apr 24, 2025, 03:25 PM
పోలీస్ అధికారులకు సిబ్బందికి శాఖపరమైన లేదా వ్యక్తిగత సమస్యలు ఉంటే ఉన్నతాధికారులకు తెలియజేయాలని సిరిసిల్ల ఎస్పీ మహేష్ బి గీతే అన్నారు. సిరిసిల్ల పట్టణంలోని పోలీస్ కార్యాలయంలో మానసిక ఆరోగ్య అవగాహన శిబిరాన్ని గురువారం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. శాంతిభద్రతల పరిరక్షణలో సివిల్, ఆర్ముడ్ పోలీస్ సిబ్బంది పాత్ర కీలకమని సిబ్బంది సంక్షేమానికి తెలంగాణ పోలీస్ శాఖ కట్టుబడి ఉందని వివరించారు.