|
|
by Suryaa Desk | Thu, Apr 24, 2025, 03:24 PM
TG: హైదరాబాద్ మెట్రో రైలు ఎండీకి తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. మెట్రో రైళ్లో బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్లకు సంబంధించి పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశాలు జారీచేసింది. తదుపరి విచారణను వచ్చే సోమవారానికి వాయిదా వేసింది. కాగా, మెట్రో రైల్లో బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్లను సవాల్ చేస్తూ అడ్వకేట్ నాగూర్ బాబు హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు.