|
|
by Suryaa Desk | Thu, Apr 24, 2025, 08:00 PM
మెదక్ జిల్లా రామయంపేట మండలం జాన్సీ లింగాపూర్ గ్రామంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం యాసంగి వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని గురువారం గ్రామ సెక్రెటరీ పద్మ టెంకాయ కొట్టి, రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ యాసంగిలో పండించిన పంటను రైతులు దళారులకు అమ్మి మోసపోవద్దని ప్రభుత్వ మద్దతు ధరకే మాత్రమే విక్రయించాలని సూచించారు.