|
|
by Suryaa Desk | Thu, Apr 24, 2025, 08:02 PM
భూ భారతి 2025 నూతన ఆర్. ఓ. ఆర్ చట్టం భూ వివాదాల పరిష్కారానికి ఎంతగానో దోహదపడుతుందని జిల్లా గ్రంధాలయ ఛైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి అన్నారు. గురువారం రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం, షాబాద్ మండల్లోని స్టార్ ఫంక్షన్ హాల్ లో భూ భారతి చట్టం-2025 పై అవగాహన సదస్సు నిర్వహించారు. జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి, చేవెళ్ల శాసన సభ్యులు కాలే యాదయ్య చట్టంపై, అందులోని అంశాలపై రైతులకు అవగాహన కల్పించారు.