|
|
by Suryaa Desk | Thu, Apr 24, 2025, 08:04 PM
రాష్ట్రంలో రోజు రోజుకు ఉష్ణోగ్రతల తీవ్రత పెరుగుతోంది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఎండ వేడిమి 40 డిగ్రీలు దాటింది. 7 జిల్లాలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం గురువారం రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, జగిత్యాల, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, కొమరంభీమ్ ఆసిఫాబాద్ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఈ జిల్లాల్లో 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని హెచ్చరించింది.ఇవాళ, రేపు ఉత్తర తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో అక్కడక్కడా వడగాల్పులు వీచే అవకాశం ఉందని వెల్లడించింది. చాలా జిల్లాల్లో రాత్రి పూట వేడి వాతావరణం మరింత అధికంగా ఉండనుందని తెలిపింది.నిర్మల్ జిల్లాలో వడదెబ్బతో యువకుడు మృతి చెందారు. ఎండ వేడికి అస్వస్థతకు గురైన బ్రహ్మపురికి చెందిన సోఫి బేగ్ (25) ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు.