|
|
by Suryaa Desk | Fri, Apr 25, 2025, 10:31 AM
రైతులు, వినియోగదారులు మామిడి పండ్ల మార్కెట్ ను వినియోగించుకోవాలని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ సూచించారు. ఖమ్మం రోటరీనగర్ లోని వీధి వ్యాపారుల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మామిడి పండ్ల మార్కెట్ ను గురువారం ప్రారంభించారు. ప్రాంగణంలో 35 మంది రైతులు నేరుగా కార్బైడ్ రహితంగా పండించిన మామిడి అమ్ముకునే వీలుందని తెలిపారు. ఇదే ప్రాంగణంలో సీజన్ల వారీగా పండ్ల విక్రయానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.