|
|
by Suryaa Desk | Fri, Apr 25, 2025, 12:10 PM
మరికల్ మండల కేంద్రంలో రేపటి నుండి రెండు రోజుల పాటు జరిగే తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర విస్తృతస్థాయి సమావేశానికి సంబంధించిన వాల్ పోస్టర్, కర పత్రాలను శుక్రవారం దామరగిద్ద మండలం ఆశన్ పల్లి గ్రామంలో సంఘం నాయకులు ఆవిష్కరించారు.
అనంతరం నాయకులు హన్మంతు మాట్లాడుతూ.. ప్రభుత్వ భూములు సాగు చేసుకుంటున్న పేద ప్రజలకు పట్టాలు ఇవ్వాలని కోరారు. సమావేశానికి కార్మికులు పెద్ద సంఖ్యలో తరలి రావాలని కోరారు.