|
|
by Suryaa Desk | Fri, Apr 25, 2025, 12:20 PM
కామారెడ్డి జిల్లాలో మునుపెన్నడు లేని విధంగా దుబాయ్ దేశంలో ఉండే విధంగా ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. శుక్రవారం కలెక్టర్ నుండి విడుదల చేసిన ఉష్ణోగ్రతల వివరాల ప్రకారం.
కామారెడ్డి జిల్లాలోని మద్నూర్ మండలం మేనుర్ లో అత్యధికంగా 44. 6డిగ్రీల ఉష్ణోగ్రతలు, బిచ్కుందలో 44. 5డిగ్రీలు, మద్నూర్లో 44. 4డిగ్రీలు, నసురుల్లాబాద్ లో 44డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. బయటకు వెళ్లే ముందు జాగ్రత్తలు పాటించాల్సిందే.