|
|
by Suryaa Desk | Fri, Apr 25, 2025, 02:00 PM
రైతుల సంక్షేమమే ధ్యేయమని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావు అన్నారు. శుక్రవారం జూలపల్లి మండలం వడ్కాపూర్, వెంకట్రావుపల్లి, కాచాపూర్, కీచులాటపల్లి, కుమ్మరికుంట గ్రామాల్లో సింగిల్ విండో, ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్, డైరెక్టర్లు, కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, రైతులు పాల్గొన్నారు.