|
|
by Suryaa Desk | Fri, Apr 25, 2025, 02:10 PM
మహబూబాబాద్ జిల్లా మరిపెడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ గుగులోతు రవి ఆధ్వర్యంలో ప్రపంచ మలేరియా దినోత్సవం 2025 సందర్బంగా ఆరోగ్య సిబ్బందితో మరిపెడ మున్సిపాలిటీ కేంద్రంలో ర్యాలీ మరియు అవగాహన కార్యక్రమం శుక్రవారం నిర్వహించడం జరిగింది. డాక్టర్ రవి మాట్లాడుతు "మలేరియా అంతం మనతోనే " అనే నినాదంతో ఈ రోజు మలేరియా దినోత్సవం జరుపుకోవడం జరుగుతుందని తెలిపారు.