|
|
by Suryaa Desk | Fri, Apr 25, 2025, 02:56 PM
కాశ్మీర్‌లో ఉగ్రవాదుల దాడిలో మృతి చెందిన వారికి సనాతన హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో నివాళులర్పించారు. శుక్రవారం ఆదిలాబాద్ గోపాలకృష్ణ మఠం వద్ద ఏర్పాటుచేసిన కార్యక్రమంలో మృతి చెందిన వారి చిత్రపటాలకు పుష్పాంజలి ఘటించి మౌనం పాటించారు.
అమాయక పర్యాటకులపై ఉగ్రవాదుల దాడి పిరికిపంద చర్య అన్నారు. మాజీ మంత్రి జోగురామన్న, మాజీ జడ్పి ఛైర్ పర్సన్ సుహాసిని రెడ్డి, మఠాధిపతి యోగానంద సరస్వతి, తదితరులున్నారు.