|
|
by Suryaa Desk | Fri, Apr 25, 2025, 03:06 PM
మెదక్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. అత్తింటి వేధింపులు తాళలేక రామాయపేటకు చెందిన రేష్మా బేగం (30) పిల్లల చేతులు కోసి ఉరేసుకుంది. ఈ ఘటనలో మహిళ మృతి చెందింది.
గమనించిన స్థానికులు పిల్లలను వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం పిల్లలు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని భర్తను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.