|
|
by Suryaa Desk | Fri, Apr 25, 2025, 03:10 PM
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ 2022లో చేపట్టిన భారత్ జోడో యాత్రలో సావర్కర్ ఆంగ్లేయుల సర్వెంట్ అని, సావర్కర్ బ్రిటిష్ వారి నుండి పెన్షన్ పొందారని ఆరోపించారు. దీంతో పలువురు ఆయనపై పిర్యాదు చేశారు.
ఈ క్రమంలో స్వాతంత్య్ర సమరయోధులను అపహస్యం చేయవద్దని రాహుల్ గాంధీని సుప్రీంకోర్టు శుక్రవారం హెచ్చరించింది. ఇలాంటి వ్యాఖ్యలను కొనసాగిస్తే పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని ధర్మాసనం మండిపడింది.