|
|
by Suryaa Desk | Fri, Apr 25, 2025, 03:28 PM
కర్రే గుట్ట ఆపరేషన్ వెంటనే ఆపాలంటూ నార్త్-వెస్ట్ సబ్ జోనల్ బ్యూరో రూపేష్ పేరుతో మావోయిస్టులు లేఖ విడుదల చేశారు. శాంతి చర్చలకు ముందుకు రావాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు విన్నవించుకున్నారు. శాంతి చర్చల ద్వారా సమస్యను పరిష్కరించే అవకాశం ఉందని పేర్కొన్నారు. చర్చలకు తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఒక నెల సైనిక చర్య వాయిదా వేసి చర్చలకు పిలవాలని మావోయిస్టులు ప్రకటన విడుదల చేశారు.