|
|
by Suryaa Desk | Fri, Apr 25, 2025, 03:51 PM
చారకొండ మండలం అగ్రహారం తండాలో నెలరోజుల నుంచి త్రాగునీరు లేక తండావాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మా గ్రామ పంచాయతీకి కార్యదర్శి లేకపోవడంతో గ్రామంలో నెలకొన్న సమస్యలు ఎవరికి.
చెప్పుకోవాలో తెలియని పరిస్థితి నెలకొన్నదని గిరిజన మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. మా గ్రామ సమస్యలను ఎవరు పట్టించుకోవడం లేదని కనీసం ఎమ్మెల్యే నైనా దృష్టి సారించి మా గ్రామంలో త్రాగునీటి సమస్యను పరిష్కరించాలని కోరుచున్నారు.