|
|
by Suryaa Desk | Fri, Apr 25, 2025, 03:58 PM
దేవరకద్ర మండల కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన భూ భారతి చట్టం అవగాహన సదస్సుకు శుక్రవారం ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. భూభారతి చట్టంతో రైతుల భూములకు భద్రత లభిస్తుందని, భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం భూభారతి చట్టమని అన్నారు. ఇకపై గ్రామాల్లో భూ పంచాయితీలు, వివాదాలు ఉండవన్నారు. భూ భారతిపై ప్రతి గ్రామంలో రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తామని తెలిపారు.