|
|
by Suryaa Desk | Fri, Apr 25, 2025, 08:02 PM
తెలంగాణ ప్రజల గొంతుకై పుట్టిన పార్టీ బిఆర్ఎస్.... తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చిన పార్టీ బిఆర్ఎస్ పార్టీ మాత్రమే . ఈనెల 27వ తేదీన వరంగల్ ఎల్కతుర్తిలో బిఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రివర్యులు కెసిఆర్ గారి అధ్యక్షతన జరగనున్న "చలో వరంగల్" 25వ రజతోత్సవ వేడుకల ఏర్పాట్లపై ఈరోజు పెట్ బషీరాబాద్ లోని ఎమ్మెల్యే గారి క్యాంప్ కార్యాలయంలో బిఆర్ఎస్ పార్టీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ గారి అధ్యక్షతన నిర్వహించిన సమీక్ష సమావేశంలో కుత్బుల్లాపూర్ నియోజక వర్గంలోని జిహెచ్ఎంసి, నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ లకు చెందిన మాజీ డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్, ఎన్ఎంసి బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రంగరాయ ప్రసాద్, మాజీ కార్పొరేటర్లు ఆగం రాజు, కోలన్ మీనా సునీల్ రెడ్డి, గాజుల సుజాత, రవి కిరణ్, బొర్రా దేవి చందు ముదిరాజ్, డివిజన్ అధ్యక్షులు, ప్రజా ప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అనుబంధ సంఘాల సభ్యులు, మహిళా నాయకురాలు హాజరవగా ఈనెల 27వ తేదీ ఆదివారం రోజున వరంగల్లో నిర్వహించే బిఆర్ఎస్ పార్టీ రజతోత్సవ వేడుకల ఏర్పాట్లపై బిఆర్ఎస్ పార్టీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ గారు వారికి దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ గారు మాట్లాడుతూ.... నీళ్లు, నిధులు, నియామకాలలో తెలంగాణ ప్రాంతానికి జరుగుతున్న వివక్షతపై మన నాయకులు, పెద్దలు కేసీఆర్ గారు తెలంగాణ స్వరాష్ట్ర సాధన తోనే అభివృద్ధి సాధ్యమని నమ్మి 2001 లో టిఆర్ఎస్ పార్టీని స్థాపించారు. పార్టీ స్థాపించిన వాటి నుంచి ఎన్నో అవమానాలను తట్టుకుంటూ తెలంగాణ వానిని వినిపిస్తూ తెలంగాణ ప్రజల గొంతుకై పాలకులతో కొట్లాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన మహానేత కెసిఆర్ గారు అని అన్నారు. స్వరాష్ట్రాన్ని సాధించిన 10 ఏళ్లలోనే అభివృద్ధి, సంక్షేమాలతో దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా అభివృద్ధి చేసి సస్యశ్యామలం చేసిన ఘనత బిఆర్ఎస్ అధినేత కెసిఆర్ గారికే దక్కుతుందన్నారు. ఇంతటి ఘన చరిత్ర కలిగిన బిఆర్ఎస్ పార్టీ రజతోత్సవ వేడుకలకు కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నుంచి భారీ భారీ సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు తరలి వెళ్లేలా అందరం సమన్వయం చేసుకుంటూ బయలుదేరి వెళ్లి చలో వరంగల్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు.