|
|
by Suryaa Desk | Sat, Apr 26, 2025, 12:19 PM
కాశ్మీర్లోని పహల్గామ్ లో ఇస్లామిక్ ఉగ్రవాదులు ఆర్మీ యూనిఫాంలో వచ్చి 27 మంది టూరిస్టులను కిరాతకంగా కాల్చి చంపిన ఘటన దేశంలో ప్రతి ఒక్కరిని దిగ్భ్రాంతికి గురి చేసింది.ఈ ఘటనను ఖండిస్తూ చౌటుప్పల్ విశ్వహిందూ పరిషత్బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో రామాలయం నుండి బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించడం జరిగింది. విశ్వహిందూ పరిషత్ జిల్లా అధ్యర్యం లో ఇది అత్యంత పిరికిపంద చర్య అని, అమాయకులైన హిందూ సందర్శకులని కాల్చి చంపడం ప్రతి ఒక్కరినీ కలిసి వేసింది అని ఈ చర్యను ప్రతి ఒక్కరు ఖండించవలసిందిగా కోరుతున్నాం అని తెలియజేశారు.