|
|
by Suryaa Desk | Sat, Apr 26, 2025, 04:22 PM
ప్రభుత్వ పథకాలను సమర్ధవంతంగా అమలు చేస్తూ జిల్లా అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షిషా తెలిపారు. ఇటీవల సివిల్ సర్వీసెస్ డే సందర్భంగా ప్రధాని మోదీ చేతుల మీదుగా కలెక్టర్ పురస్కారం అందుకోవడం పట్ల పాత్రికేయులు ఆయనను శనివారం సత్కరించారు. క్యాంపు కార్యాలయంలో కలెక్టర్ ను మర్యాదపూర్వకంగా కలిసి శాలువా, పుష్పగుచ్చాలతో సత్కరించారు. కార్యక్రమంలో డిపిఆర్ఓ తిరుమల, తదితరులు పాల్గొన్నారు.