|
|
by Suryaa Desk | Sat, Apr 26, 2025, 04:23 PM
తెలంగాణ సమాజంలోని అన్ని వర్గాల ఆకాంక్షలు నెరవేర్చడమే తమ లక్ష్యమని CM రేవంత్ అన్నారు. HYDలోని HICCలో నిర్వహించిన భారత్ సమ్మిట్‌లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, CM రేవంత్, నేతలు పాల్గొన్నారు. సీఎం మాట్లాడుతూ.. 'మా ప్రభుత్వంపై ప్రజలు పెట్టుకున్న ఆకాంక్షలు నెరవేర్చేందుకు అనేక పథకాలు తీసుకొచ్చాం. దేశంలోనే అతిపెద్ద రైతు రుణమాఫీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. రూ. 20 వేల కోట్ల రుణమాఫీ చేశాం' అని వివరించారు.