|
|
by Suryaa Desk | Sun, Apr 27, 2025, 12:01 PM
సైదాపూర్ మండలం లస్మన్నపల్లిలో బీఆర్ఎస్ పార్టీ 25వ రజతోత్సవ సంబరాల్లో భాగంగా కొబ్బరికాయలు కొట్టి గ్రామ శాఖ అధ్యక్షులు నాంపల్లి భూపతి బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగురవేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం స్వీట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో సింగిల్ విండో అధ్యక్షులు బిల్ల వెంకట్ రెడ్డి, మాజీ సైదాపూర్ మండలం ఎంపీపీ సారబుడ్ల ప్రభాకర్ రెడ్డి, మాజీ సర్పంచ్ కాయిత రాములు, యూత్ అధ్యక్షుడు తలారి రాము తదితరులు పాల్గొన్నారు.