|
|
by Suryaa Desk | Sun, Apr 27, 2025, 12:06 PM
TG: పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అందరికీ ఆదర్శంగా నిలిచారు. తన భార్య విజయకు గోదావరి ఖనిలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి (జీజీహెచ్)లో ప్రసవం చేయించారు. అయితే శనివారం విజయకు పురిటి నొప్పులు రాగా.. వెంటనే జీజీహెచ్‌కు తరలించారు. ఆమెకు పండంటి మగబిడ్డ జన్మించాడు. కాగా విజయ గర్భం దాల్చినప్పటి నుంచి ప్రభుత్వ ఆసుపత్రిలోనే చికిత్స పొందినట్లు కలెక్టర్ వెల్లడించారు. దీంతో వారిపై ప్రముఖులు, నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.