|
|
by Suryaa Desk | Sun, Apr 27, 2025, 12:30 PM
నల్గొండ మండలం కొత్తపల్లి గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ 25వ రజతోత్సవం సందర్భంగా ఆదివారం పార్టీ శ్రేణులతో కలిపి మాజీ ఎంపీపీ నారబోయిన బిక్షం గ్రామంలో గల బస్ స్టాప్ వద్ద ఉన్న పార్టీ జెండాను ఎగరవేసి గ్రామం నుంచి భారీగా వరంగల్ సభకు బయలుదేరారు. ఈ కార్యక్రమంలో యువజన విభాగం మండల అధ్యక్షుడు ఐతగోని విజయ్ కుమార్, లింగయ్య, నక్క వెంకటేశం, వెంకట్ రెడ్డి, రమణారెడ్డి, స్వామి తదితరులు పాల్గొన్నారు.