|
|
by Suryaa Desk | Sun, Apr 27, 2025, 03:24 PM
హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో మరికాసేపట్లో జరుగనున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభకు పార్టీ శ్రేణులు రాష్ట్రం నలుమూలల నుంచి భారీగా తరలివెళ్తున్నాయి. హైదరాబాద్ నుంచి పెద్ద సంఖ్యలో వాహనాలు వెళ్తుండటంతో ఘట్ కేసర్ ORR వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ట్రాఫిక్‌ను పోలీసులు క్లియర్ చేస్తున్నారు. అటు వివిధ జిల్లాల నుంచి మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, సీనియర్ నేతల ఆధ్వర్యంలో కార్యకర్తలు సభాస్థలికి బయల్దేరారు.